ఎంత సీనియర్ లాయర్ అయినా కోర్టు హాలులో జడ్జి ముందు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తికి ప్రత్యేక గౌరవం, మర్యాద ఉంటుంది. కానీ కరోనా వైరస్ కారణంగా దేశంలో కోర్టులన్ని దాదాపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సాగుతున్నాయి. అయినా అంతే మర్యాదగా వ్యవహరించాల్సిన సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఏకంగా హుక్కా తాగుతూ కనిపించాడు.

రాజస్థాన్ లో వేడేక్కిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావటంపై రాజస్థాన్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఓవైపు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదిస్తుండగా, ఆ కేసులోనే మరో సీనియర్ లాయర్ రాజీవ్ దావన్ కూడా ఉన్నారు. తన వంతు వచ్చేదాకా ఏం చేద్ధామనుకున్నారో… లేక హీట్ రేపుతున్న వాదనల్లో తన అబ్జెక్షన్స్ పై టెన్షనో తెలియదు కానీ గాబరా గాబరాగా హుక్కా తాగుతూ కనిపించారు. పైగా భయటకు కనపడకుండా ఓ పేపర్ అడ్డు పెట్టుకొని గబగబా పని కానిచ్చేశారు. కానీ లాస్ట్ లో మాత్రం హుక్కా తాగినట్లుగా స్పష్టంగా కనపడింది.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య కేసును వాదించిన ఈయన, లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై కేసులోనూ వాదిస్తున్నారు.