పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతున్నట్టు ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.
తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో తాను రెండు రోజలు పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని పేర్కొన్నారు.
అందువల్ల రెండు రోజుల పాటు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. గతంలో డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా పని చేశారు.
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ సొంత పార్టీలో ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గోవడం లేదు.