ప్రొఫెసర్ కోదండరామ్ కు బిగ్ షాక్ తగిలింది. టీజేఎస్ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. తెలంగాణ జనసమితిలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాపురం వెంకట్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తో క్రియాశీలకంగా ఉంటూ పని చేసారు గంగాపురం వెంకట్ రెడ్డి. శనివారం పార్టీకి తన రాజీనామాను సమర్పించారు.
గంగాపురం వెంకట్ రెడ్డి 2000 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ టీజేఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా గంగాపురం ఉన్నారు.
అయితే టీజేఎస్ పార్టీ విధాన పరమైన నిర్ణయాలతో విభేదిస్తున్నానని, అందుకే టీజేఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
గత 14 ఏళ్లుగా ప్రొఫెసర్ కోదండరామ్ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గంగాపురం వెంకట్ రెడ్డి రాజీనామాపై ప్రొఫెసర్ కోదండరామ్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.