విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. అలాగే సినిమాల విషయంలో షూటింగ్ కి వెళ్లేటప్పుడు కూడా ఒకరి వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న సిద్ధాంతంతో వెళ్లేవారట ఎన్టీఆర్. ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట. ఇప్పుడు బాలయ్య కూడా అదే టైమింగ్ పాటిస్తారు.
ఇకపోతే ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డాడట. ఒక రోజుకు మూడు షిఫ్ట్ ల చొప్పున పనిచేసేవారట. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొనేవారట. అంత బిజీ షెడ్యూల్ సమయంలో కూడా ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం రాజీ పడే వారు కాదట. అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట.
బాలకృష్ణ వదులుకున్న 10 సూపర్ హిట్ మూవీస్ ఇవే !!
ఉదయం టిఫిన్ చేసేటప్పుడు పది, పదిహేను ఇడ్లీలు తింటే… తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు 5,6 ఇడ్లీలు తినేవారట. అలాగే మధ్య మధ్యలో యాపిల్ జ్యూస్ కూడా తాగేవారట. ఆపిల్ జ్యూస్ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమట. అంతేకాకుండా మద్రాసులో యాపిల్ పండు ఎక్కడ బాగుంటాయో కూడా చెప్పి మరీ తెప్పించుకునేవారట.
మళ్లీ లొల్లి… ప్రీతమ్ కు ఐ లవ్ యూ చెప్పిన సమంత!!
ఒక రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా బజ్జీలు తినటం ఎన్టీఆర్ కు ఇష్టమట. అలాగే డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారట. దానివల్ల అలసట రాదని తోటి నటీనటులకు చెప్పేవారట. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా తీసుకునే వారట ఎన్టీఆర్. మధ్యాహ్నం భోజనం తర్వాత జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగేవారట.