సీనియర్ ఎన్టీఆర్..ఓ నటశిఖరం.ఓ ఆత్మగౌరవం. ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నటుడిగా ఎన్నోపాత్రలకు ప్రాణంపోసారు. ఎన్నో కథల్లో ఒదిగిపోయారు. ఎంతో మంది తెలుగుప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యారు. రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అందని ద్రాక్షైన నిత్యావసరాలను సంక్షేమ పథకాలద్వారా పేదవాడి పరంచేసారు.
అటు సీనీ రంగంలోనూ,ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణ జన్ముడన్న పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు చరిత్రన్నది వాదనలేని అంశం.
తలమానికమైన కీర్తిగడించిన ఆయన…తన ప్రస్థానంలో ఎన్నో ఆస్తులను కూడ బెట్టారు. ఆస్తులు వ్యక్తిగతమే అయినా ప్రజల మనిషిగా ఆయన సాధించిన అవార్డులు రివార్డుల ప్రస్తావన ఎలాంటిదో ఆస్తుల ప్రస్తావన కూడా అలాంటిదే.
రాజకీయ రంగంలో కంటే, సినిమాల్లో ఉన్నప్పుడే ఎక్కువ సంపాదించి ఉండొచ్చని సహ చరులు, విశ్లేషకుల అంచనా. అయితే ఎన్టీఆర్ ఆస్తుల గురించి చాలా మందికి సందేహం ఉండే ఉంటుంది. హైదరాబాద్ లోనే చాలా ఆస్తులు ఆయనకి ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఎన్టీఆర్ గారు ఏం సంపాదించారు.ఆయన ఆస్తులు విలువ ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్నప్పుడే ఎక్కువగా సంపాదించారు. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఇన్వెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అవి కోట్ల విలువ చేసే ఆస్తులుగా మారాయి.
Also Read: పవన్ పై కాలు దువ్వుతున్న అలీ!
1. రామకృష్ణ థియేటర్:
ఎంతో ఇష్టపడి ఎన్టీఆర్ గారు రామకృష్ణ థియేటర్ ని కట్టించుకున్నారు.
2. ఎన్టీఆర్ ఎస్టేట్:
రామకృష్ణ థియేటర్ ని కొనేసాక ఆ పరిసర ప్రాంతాలను కూడా ఆయన కొనేసి ఎన్టీఆర్ ఎస్టేట్ గా పేరు పెట్టారు. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ కూడా ఈ ఎస్టేట్ లో వున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఓ థియేటర్ ని ఓపెన్ చేయాలనీ అనుకున్నారు కానీ అవ్వలేదు.
3. తారక రామ థియేటర్:
ఈయన కాచిగూడ చౌరస్తాలోని తారకరామ థియేటర్ ని కూడా కట్టించుకున్నారు. అలానే మాసబ్ ట్యాంక్ లో ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ని ఐదు కట్టించి ఐదుగురి పిల్లలకి ఇచ్చేసారు. గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కూడా కొన్నారు. నాచారం హార్టికల్చర్ ఫిలిమ్ స్టూడియో కూడా వుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ఇల్లు వుంది. అది కూతురికి మొదట ఇచ్చారు. తరవాత లక్ష్మీపార్వతి పేరున రిజిస్టర్ చేసారు.
Also Read: ఓవర్సీస్ లో వీరయ్యదే పైచేయి