నటరత్న ఎన్టీఆర్.. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వెండితెర కథానాయకుడు. తెలుగు చరిత్ర ఉన్నంతకాలం చెప్పుకునే పేరు. తిరుగులేని ప్రజా నాయకుడు. ఆయన చిత్రాలు, పాత్రలు, సృష్టించిన చరిత్రలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతమే అని చెప్పుకోవాలి. 1923 మే 28న నిమ్మకూరులో జన్మించిన ఆ మహనీయుడి శత జయంతి సంవత్సరం ఇది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఆయన ప్రకటనలో నటించారనే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అయితే ఆ యాడ్ ఎన్టీఆర్ చేసినందుకు భారీ పారితోషికం అందుకున్నారట.
ఎన్టీఆర్ చేసిన యాడ్.. విజయా కెమికల్స్ వారి అశోకా ఆమ్లా బ్రిలియంటైన్ బ్రాండ్ కి చెందినది. ఆ ప్రకటనకు సంబంధించిన పేపర్ కటింగ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అశోకా ఆమ్లాలో ఉన్న ఔషదాల వల్ల మెదడుకి, కళ్లకి చల్లదనంతో పాటు.. రోజంతా హెయిర్ సువాసన వెదజల్లుతుందని.. ఇది స్త్రీ, పురుషులకు ఉత్తమ శిరోజాలంకరణ సాధనము అని ఉంది.
ఇక వారి బ్రాండ్‌ని ప్రమోట్ చేసినందుకు గానూ.. ఎన్టీఆర్ అక్షరాలా ఒక లక్ష రూపాయలను అప్పట్లోనే పారితోషికంగా ఇచ్చారట. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్. ఇక ఆ తర్వాత రామారావు ఏ యాడ్స్ లోనూ నటించలేదని తెలుస్తోంది.
Also Read: మెగా ఫ్యామిలీని తిట్టి.. ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు వీళ్లే!!