విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆంధ్రుల ఆరాధ్య దైవం గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ అప్పటి జనరేషన్ వారికే కాదు ఇప్పటి జనరేషన్ వారికి కూడా ఇన్స్పిరేషన్. ఒకానొక సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండేది. దీంతో చాలా మంది నటులు ఇబ్బంది పడే వాళ్ళు.
ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ తెలుగు వారికి ఒక పరిశ్రమ ఉండాలని చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. అందుకు గాను ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద పరిశ్రమగా తెలుగు ఇండస్ట్రీ నిలిచింది.
సమరసింహా రెడ్డి సినిమాలో ఒక్క సీన్ నచ్చలేదని సినిమానే వద్దుఅనుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?
ఎన్టీఆర్ పాటు ఏఎన్ ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్స్ కూడా పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేశారు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నందమూరి తారకరామారావు 1942లో మే 2 న వివాహం చేసుకున్నారు. కాగా తాజాగా ఎన్టీఆర్ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజమౌళి తాత ఇచ్చిన కోట్లరూపాయల ఆస్తులు ఎలా పోయాయో తెలుసా ?
ఒక అభిమాని ఆ ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం చనిపోవడంతో 1985లో ఆమె జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించి ఉచితంగా వైద్య సేవలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ ను నందమూరి బాలకృష్ణ నడిపిస్తున్నాడు.
Advertisements
ఎన్టీఆర్ చలనచిత్ర పరిశ్రమ కోసమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కూడా ఎంతో కష్టపడ్డారు. 1982 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983 వ సంవత్సరం లో ముఖ్యమంత్రిగా గెలుపొందాడు. నాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మొదటి ముఖ్యమంత్రి గా చరిత్ర సృష్టించాడు. పేద ప్రజలకు బియ్యం,వైద్యం, కరెంటు అన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాడు.