ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్ విద్యార్థులు గుండు చేయించారు సీనియర్లు. కాలేజీకి వస్తూ వస్తూనే వీరంతా గుండు చేయించుకుని సీనియర్లకు సెల్యూట్ చేస్తూ లోపలికి రావాలట. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. కాలేజీ మెయిన్ గేట్ దగ్గరే ఈ సెల్యూట్ కార్యక్రమం జరుగుతున్నా కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం మాత్రం ర్యాగింగ్ లాంటివేవీ జరగలేదని బుకాయిస్తోంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం, ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించామంటున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » గుండు చేయించారు… శాల్యూట్ చేయించారు..