సరిలేరు నీకెవ్వరు సినిమాతో చాలా రోజుల తర్వాత విజయశాంతి ఎంట్రీ ఇవ్వగా… చిత్ర యూనిట్ మరో సర్‌ఫ్రైజ్ రివీల్ చేసింది. ఈ సినిమాలో సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ రీఎంట్రీ ఇవ్వనున్నారట. చాలా కాలం తరువాత మహేష్ బాబు, కృష్ణ ఒకే సారి వెండితెరపై కనిపించనున్నారు. అయితే కృష్ణ ఎంట్రీ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు ఉండబోతోందనే ఆసక్తి ఘట్టమనేని ఫ్యాన్స్ లో మొదలైంది.
ఆదివారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ సినిమా పై మంచి అంచనాలను పెంచాయి. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి ఎత్తాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.