ఐపీఎల్ 2022 సీజన్ వేలంపై సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే.. సంతలో పశువులను కొంటున్న భావన కలుగుతోందని తీవ్ర విమర్శలు చేశాడు. సంతలో సరుకులకోసం జనాలు పోటీపడినట్లు.. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడటం దారుణమన్నారు.
వేలంలో ఓ క్రికెటర్ ని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే పర్వాలేదు. కానీ..ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఊహించడానికే దారుణంగా ఉంటుందన్నాడు ఉతప్ప.
వేలం అనేది చాలాకాలం క్రితం రాసిన పరీక్షలా అనిపిస్తోందన్నాడు. ఆ తర్వాత రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంటోందని చెప్పాడు ఉతప్ప. ఐపీఎల్ వేలం జరిగిన తీరు చూస్తే… క్రికెటర్లు కూడా మనుషులే అనే విషయాన్ని ఫ్రాంచైజీలు మరచిపోయినట్టు అనిపించిందని పేర్కొన్నాడు.
ఇండియాలో తప్ప ఇలా ఆటగాళ్ల వేలం ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని వ్యాఖ్యానించాడు. వేలం బదులు డ్రాప్ట్ పద్దతి అమలు చేస్తే బాగుంటుందని సూచించాడు.