సోషల్ మీడియాలో తనని బాడీషేమింగ్ చేస్తున్నారని తన శరీరం రంగు గురించి పదే పదే విమర్శిస్తున్నారని మండిపడ్డారు గవర్నర్ తమిళిసై. తనని నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే… అగ్గిలా మారి వణికిస్తానని బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్‌పై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నైలోని ఒక బాలికల కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనని నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే… అగ్గిలా మారి వణికిస్తానని బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్‌పై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉంటానని, నుదురు బట్టతలలా ఉంటుందని హేళన చేస్తున్నారు.
తనను ట్రోల్ చేసే వారిని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నల్లగా ఉన్నానని ట్రోల్ చేసినా తాను నొచ్చుకోనని, వారందరూ ఊహించని స్థాయికి తాను ఎదుగుతానని తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు.
బాడీ షేమింగ్ చేయడం ఇటీవల కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు. నల్లగా ఉన్నా తాను అగ్గిలా ఉంటానని ఆమె వ్యాఖ్యానించారు.