ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ మాట్లాడిన వీడియోకు ట్యాగ్ చేసి ఆయన సంచలన ట్వీట్ చేశారు.
అసూయకు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయని ఇటీవల జగన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్న లాంటి వాడు సీఎం జగన్ మోహన్ రెడ్డేనని ట్వీట్ చేశారు.
అందుకే నాన్న, బాబాయ్ కు టికెట్ తీసి పంపేశాడని లోకేష్ తీవ్రంగా విమర్శలు చేశారు. మరోసారి సీఎం జగన్ అసూయతో గర్వం దాల్చాడని ఎద్దేవా చేశారు.
మరి ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? అంటూ లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపైన జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి