హైదరాబాద్ ఉగ్ర కుట్ర భగ్నం కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతానికి ప్లాన్ చేశారు ముష్కరులు. సామూహిక దాడులతో ప్రజల్లో అనిశ్చితి నెలకొల్పి.. అంతర్గత భద్రతకు ముప్పువాటిళ్లేలా స్కెచ్ వేశారు. భారీగా ప్రాణనష్టం చేయాలని నిందితులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కుట్రను సీసీఎస్ పోలీసులు భగ్నం చేశారు.
పేలుడు పదార్థాలను పాకిస్తాన్ నుంచి ఫరాతుల్లా ఘోరి పంపినట్లు గుర్తించారు పోలీసులు. మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు పేలుడు పదార్థాలు వచ్చాయని.. గత నెల 28న జాహెద్ కు అవి అందాయని తెలిపారు. వాటిని బైక్ పై వెళ్లి తీసుకొచ్చాడు. ఒక గ్రనేడ్ ను తనవద్దే ఉంచుకున్న జాహెద్.. మిగతా మూడింటినీ.. సమీరుద్దీన్, మజ్ హసన్ లకు ఇచ్చాడు.
సమీరుద్దీన్ సెల్ ఫోన్ తో ఫరాతుల్లా ఘోరితో చాటింగ్ చేసిన జాహెద్.. 12 ఏళ్లు జైలులో ఉండి తిరిగొచ్చాక ఉగ్ర కార్యకలాపాలకు పథకం వేశాడు. పాక్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళిక జరిగింది. రూ.30 లక్షలకుపైగా హవాలా ద్వారా నిందితులకు నగదు అందినట్లు పోలీసులు గుర్తించారు.
యువకులకు డబ్బులిచ్చి ఉగ్రవాదం వైపు ప్రేరేపించేలా జావెద్ ప్రయత్నాలు చేశాడు. హైరాబాద్‌లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు ప్లాన్ చేశారు. ఒకేసారి దాడులకు పథక రచన చేశారు.