హైదరాబాద్ మాదకద్రవ్యాల కేసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. మాదకద్రవ్యాల కేసులో జితిన్ ను విచారణ పోలీసులు పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. డీలర్ జితిన్ కేవలం మాదక ద్రవ్యాల సరఫరానే కాకుండా.. వ్యభిచార ముఠాను కూడా నడుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా గురువారం బంజారాహిల్స్ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. 62 మంది యువతులను వ్యభిచార కూపంలోకి జితిన్ దింపినట్లు తెలిపారు. ఇందులో 14 మంది హైదరాబాద్ యువతుల కాంటాక్ట్స్ ను తాజాగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ముఠా అమ్మాయిలతో మాదకద్రవ్యాలు సరఫరా చేయిస్తున్నట్లు వెల్లడించారు.
జితిన్ యువతులతో మాదకద్రవ్యాల పార్టీ నిర్వహించాడని తెలుస్తోంది. ఈ కేసులో జితిన్ ని కస్టడీ కోరుతూ నార్కోటిక్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు ముంబైకి చెందిన జితిన్ బాలచంద్ర భలే రావు, జావేద్ షంషేర్, ఆలీ సిద్ధిఖీ, జునైద్ షేక్, వికాస్ మోహన్ కుమార్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ముంబైకి చెందిన జితిన్ బీమా ఏజెంట్ గా చెలామణి అవుతూ.. సింథటిక్ డీలర్ల నుంచి ప్రభుత్వం నిషేధించిన ఎండీఎంను కొనుగోలు చేసి వాటిని మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తాజాగా జరిపిన విచారణలో జితిన సాగిస్తున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది.