స్టాక్ మార్కెట్ల ఊపు చూస్తుంటే రికార్డుల వేట కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. గురువారం 60 వేల పాయింట్లకు దగ్గరలోకి వచ్చిన సెన్సెక్స్.. శుక్రవారం మొదటిసారి ఆ ఫీట్ ను సాధించింది. ఇటు నిఫ్టీ సైతం 18వేల పాయింట్ల మైలురాయిని అందుకుంది.
అమెరికా మార్కెట్లు లాభాల బాటలో పయనించడం.. ఆసియా మార్కెట్లలోనూ ఆ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు నిపుణులు. అలాగే దేశీయంగా పలు సానుకూల పరిణామాలు కూడా బుల్ రంకెకు కారణమయ్యాయని అంటున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 73 రూపాయల 78 పైసల దగ్గర ట్రేడ్ అవుతోంది.