దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మరోవైపు అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూల అంశాలు కనిపించలేదు.
దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 778.38 పాయింట్లు నష్టపోయి 55,468.90 వద్ద ముగియగా, నిఫ్టీ 187.95 పాయింట్లు నష్టపోయి 16,605.95 వద్ద ముగిసింది.
మారుతి సుజుకీ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, హెచ డీఎఫ్ సీ బ్యాంకులు షేర్లు బుధవారం భారీ నష్టాలను చవి చూశాయి.
టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీల, యాక్సిస్ బ్యాంకు, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల షేర్లు భారీ లాభాల్లో ర్యాలీ చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 44 పైసలు పెరిగి రూ. 75.77కు చేరుకుంది.