దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ప్రారంభం నుంచే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు ఉండటం, దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, దేశీయంగా నిన్నటి వడ్డీ రేట్ల పెంపులాంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 867 పాయింట్లు కోల్పోయి 54,836 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (నిఫ్టీ) 271 పాయింట్ల నష్టపోయి 16,411 వద్ద స్థిరపడింది. రియల్ ఎస్టేట్, మెటల్, ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, ఎస్బీఐఎన్ సూచీలు లాభాలను గడించాయి. నెస్లే, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీలో హీరోమోటార్స్ కార్పొరేషన్ అధిక లాభాలను సాధించింది. టాటా మోటార్స్, ఆక్సిస్ బ్యాంక్, యూపీఎల్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో వారాంతం సెషన్ లో మదుపర్ల సంపద రూ.4.47 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయింది