సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. గణేష్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన శతురంగ వేట్టైకి ఇది రీమేక్ మూవీ. తెలుగులో లోర్వాలేదనిపించుకున్నా ఈ మూవీకి ఇప్పటికే తమిళ్ లో సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ సీక్వెల్ రీమేక్ చేయనున్నారు.
సత్యదేవ్ కథానాయకుడిగా నటించనుండగా… గణేష్ దర్శకుడు. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. సత్యదేవ్, గణేష్ కాంబినేషన్‌లో ఓసినిమా వస్తోందని, త్వరలోనే పట్టాలెక్కుతుందని సి.కల్యాణ్ ప్రకటించారు. అయితే అది బ్లఫ్ మాస్టర్‌కి సీక్వెలా? కాదా? అనేది మాత్రం ఆయన ప్రకటించలేదు. ఇక నందమూరి బాలయ్యతోనూ సినిమా చేయడానికి సి.కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వి.వి వినాయక్ దర్శకుడు అన్న ప్రచారం ఉంది. కానీ అది వర్కవుట్ కాకపోవటంతో కె.ఎస్. రవికుమార్ తోనూ కల్యాణ్ ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. దీంత కే.ఎస్ రవికుమార్- బాలయ్య మూవీ అదేనన్న ప్రచారం కూడా సాగుతుంది.