ప్రముఖ సీరియల్ యాక్టర్ లహరి తన కారుతో ఓ వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న బుల్లితెర నటి లహరి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టారు.
ఈ ప్రమాదం జరిగిన కాసేపటికి స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో లహరి భయపడి కారులో నుంచి దిగేందుకు నిరాకరించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన శంషాబాద్ పోలీసులు గాయాలైన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నటి లహరి సంతకం తీసుకొని బుధవారం స్టేషన్ కు రావాలని పంపించారు.