సినిమాల్లో నటించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎన్నుకుంటారు..కొందరు సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేస్తాను అనే భీష్మించుకు కూర్చుంటారు. నటనే ప్రాణంగా భావించేవాళ్లు వచ్చిన అవకాశాల్ని వాడుకుంటూ తమని తాము ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతారు..అలా బుల్లితెరపై సీరియల్స్, టివిషోల లో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ తర్వాత వెండితెర మీద మెరిసిన కొందరు తారల గురించి చెప్పుకుందాం..
షారుక్ ఖాన్
బాలివుడ్ బాద్షా షారూక్ ఖాన్ అసలు యాక్టింగ్ స్టార్ట్ చేసిందే సీరియల్స్ ద్వారా.. దిల్ దరియా షారూక్ నటించిన మొదటి సీరియల్..ఆ సీరియల్లో అస్సలు గుర్తింపు లేని పాత్రలో నటించాడు..తర్వాత ఫౌజి అనే యాక్షన్ సీరియల్లోనూ, సర్కస్ అనే డ్రామా సీరియల్లోనూ నటించాడు.. దీవానా సినిమాతో బాలివుడ్లోకి అడుగుపెట్టాడు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్
“పవిత్ర రిష్తా” అనే సీరియల్ లో మానవ్ గా యాక్ట్ చేశాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్..మానవ్ కి ఎందరో అభిమానులున్నారు.. తర్వాత బాలివుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లి స్టార్ అయ్యాక అర్దాంతరంగా జీవితాన్ని ముగించాడు..
ఇర్ఫాన్ ఖాన్
క్యాన్సర్ తో మరణించి బాలివుడ్ ని శోకసంద్రంలో ముంచిన ఇర్ఫాన్ ఖాన్ సీరియల్స్ తో మొదలు పెట్టి హాలివుడ్ వరకు తన ఖ్యాతి చాటిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్..తొలినాళ్లల్లో చాణక్య,చంద్రకాంత లాంటి పదికి పైగా మేజర్స్ సీరియల్స్ లో నటించాడు ఇర్ఫాన్ ఖాన్..రోగ్ సినిమాతో బాలివుడ్ లోకి ఎంటర్ అయ్యాడు.. లంచ్ బాక్స్,పాన్ సింగ్ తోమర్,హైదర్ , ఇర్ఫాన్ నటించిన కొన్ని ప్రముఖ సినిమాలు. లైఫ్ ఆఫ్ పైతో హాలివుడ్ లోనూ అడుగుపెట్టాడు
యశ్
KGF సినిమాతో పాన్ ఇండియా హీరోగా దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్..కన్నడలో సీరియల్స్ ద్వారానే యశ్ కెరీర్ ప్రారంభమయింది..తర్వాత సినిమాల్లోకి వచ్చాడు కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యశ్ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే రాధిక పండిట్ అనే నటితో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
సుడిగాలి సుధీర్
బుల్లితెరపై చిన్నచిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తో స్టార్ గా మారిన సుడిగాలి సుధీర్..టాలివుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాల్లో నటించాడు.. 2018లో అత్యంత ప్రతిభావంతమైన పర్సన్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు సుధీర్.
సాగర్
మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేం మున్నా ..బుల్లితెరకు గుడ్ బై చెప్పి మిస్టర్ ఫర్ఫెక్ట్ లో ప్రభాస్ స్నేహితుడిగా నటించి టాలివుడ్ లో అడుగుపెట్టారు..తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్దార్ద సినిమాల్లో నటించి ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు.