కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. వ్యాక్సిన్ వస్తుందన్న ఆశతో కరోనా భయం కూడా పోతుంది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు భయం పట్టుకుంది. ప్రముఖ టీకా తయారీ సంస్థ సీరమ్ సీఈవో ఆదార్ పునావాలా కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా టీకా సైడ్ ఎఫెక్ట్ తోనే తమ ఆరోగ్యం పాడయ్యిందని కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని, ఇప్పుడు అలాంటి కోర్టు చిక్కుల నుండి ప్రభుత్వమే కాపాడాలంటూ కోరారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా ప్రజల్లో అనవసర ఆందోళన పెరగటమే కాకుండా.. టకా తయారీ దారులు దృష్టి పరిశోధన నుంచి మరలిపోతుందని, వారు దివాళా తీసే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన కేసుల్లోని ఆరోపణలకు టీకాతయారీ దారులు బాధ్యతవహించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్ల్యూహెచ్ఓ ఆద్వర్యంలోని కోవాక్స్ కూటమితో పాటూ అనేక దేశాలు ఇప్పటికే ఈ అంశంపై చర్చలు ప్రారంభించాయన్నారు. టీకా తయారీ కంపెనీలకు ఇటువంటి రక్షణ కల్పించే చట్టాలు అమెరికాలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.