ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ మరో అడుగు ముందుకేస్తోంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో ధరను నిర్ణయిస్తూ ఒప్పందం చేసుకోనుంది.
వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర 250గా ఉండే అవకాశం ఉందని… తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ లో వ్యాక్సిన్ ఒక్క డోస్ ధర వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఇప్పటికే ప్రకటించారు. అయితే, భారీ మొత్తంలో వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసే ముందు భారతీయులకు టీకా సరఫరా చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని పూనావాలా తెలిపారు.
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువవుతుంది. భారత్ తర్వాత స్థానంలోఇప్పటికే ఫైజర్, ఆస్ట్రాజెనికా, భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాయి.