తండ్రిని కోల్పోయిన బాధ నుంచి త్వరగానే కోలుకున్నాడు మహేష్. కుటుంబంతో కలిసి కొన్ని రోజులు దుబాయ్ లో ఉండి వచ్చిన ఈ హీరో, తాజాగా ముంబయిలో ప్రత్యక్షమయ్యాడు. వాటికి సంబంధించిన ఫొటోల్ని నమ్రత షేర్ చేసింది. అందులో మహేష్ నవ్వుతూ కనిపించాడు.
మహేష్ ఇండియాకు తిరిగిరావడంతో, అతడు చేయాల్సిన సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సెట్స్ నిర్మాణం మొదలైంది.
శ్యామ్ సింగ రాయ్ కోసం భారీ సెట్ వేసిన ప్లేస్ లోనే మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం భారీ సెట్ తయారవుతోంది. ఇది కాక మరో రెండు సెట్ లు కూడా రెడీ చేస్తారు. ఈ సెట్స్ లోనే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేయాలని నిర్ణయించారు.
ఇకపై మహేష్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, హైదరాబాద్ దాటి షూటింగ్ లేకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. మరికొన్ని రోజుల్లో మహేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.