మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గిరిజన బాలికకు నివాళులు అర్పిస్తూ.. చిన్నారిని కిరాతకంగా చంపిన మానవ మృగాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్రంలో ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వం పిల్లలకు ఏ విధమైన ధైర్యాన్ని కల్గిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా మృగాళ్లను శిక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా చిన్నారి విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంపై మండిపడ్డారు. అలాగే గిరిజన ప్రజా ప్రతినిధులు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే.. రేపటి రోజుల్లో తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.
నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు.. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టే వరకు బంజారా సమాజం పోరాడుతుందని స్పష్టం చేశారు అసోసియేసన్ సభ్యులు. ఈ క్యాండిల్ ర్యాలీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, ప్రజా సంఘాలు సహా పలువురు పాల్గొన్నారు.
Advertisements