పంజాబ్ లో 11 మందితో నూతన మంత్రి వర్గం ఇటీవల కొలువుదీరింది. వారిలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక తెలిపింది.
కేబినెట్ లో నలుగురు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. వారిలో 9 మంది కోటీశ్వరులు ఉన్నట్టు వెల్లడించింది. వారి సరాసరి ఆస్తి రూ. 2.87 కోట్లుగా తెలిపింది.
అత్యధిక ఆస్తులు కలిగిన మంత్రిగా బ్రామ్ శాంకేర్(రూ. 8.56 కోట్లు) ఉన్నారు. అతి తక్కువ ఆస్తి కలిగిన మంత్రిగా లాల్ చంద్(రూ. 6.19 కోట్లు) ఉన్నట్టు నివేదిక పేర్కొంది.
9 మంది అమాత్యులకు అప్పులు ఉన్నట్టు ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపినట్టు నివేదిక చెప్పింది. అత్యధికంగా బ్రామ్ శాంకేర్ రూ. 1.08 కోట్లు ఉన్నట్టు తెలిపింది.