దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య 75 వేల పై మార్క్ ను చూపిస్తుంది. గడచిన 24 గంటల్లో 78,761 కరోనా కేసులు నమోదు కాగా, 948 మంది మృతి చెందారు. ఈ మేర కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,42,734 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 63,498 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకున్నారు. 7,65,302 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.