ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి మహిళపై లైంగిక వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జలవనరుల శా మంత్రి రమేష్ జర్కిహోళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తను నగ్నంగా ఆ మహిళతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీఎం సూచన మేరకు ఆయన రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో విచారణ ప్రారంభమైందని, అన్ని విషయాలు తేలుతాయంటూ కర్ణాటక హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై ప్రకటించారు.
మంత్రి రాసలీలల వీడియో ఎలా బయటకు వచ్చిందంటే…
మంత్రి రమేష్ ఓ మహిళతో ఉన్న వీడియోలను సోషల్ మీడియా కార్యకర్త దినేష్ కల్హాలి రిలీజ్ చేశారు. పవర్ కార్పోరేషన్ లో ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి… వీడియోలో ఉన్న మహిళను లైంగికంగా వాడుకున్నట్లు ఆరోపించారు. ఆ మహిళ కుటుంబం తనను సంప్రదించగా… ఈ ఆధారాలు సేకరించామని, ఇప్పటికే మంత్రిపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ వీడియోలో సిద్ధరామయ్య మంచి పనులు చేశాడు కానీ సీఎం యడ్యూరప్ప భారీగా అవినీతి చేస్తున్నారని, కర్ణాటకకు కాబోయే సీఎం ప్రహ్లాద్ జోషి అంటూ వ్యాఖ్యానించాడు.
అయితే, వీడియో వైరల్ అయిన మొదట్లో…. అది ఫేక్ వీడియో అని మంత్రి ఖండించినప్పటికీ, బీజేపీ అధిష్టానం సూచనతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.