తెలంగాణ లో మహిళలకు రక్షణ కొరవడింది అనటానికి ఇదో ఉదాహరణ. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక డ్రైవర్లతో, కండెక్టర్లతో నడుపుతున్న సంగతి తెలిసిందే. రోజుకి వెయ్యి రూపాయాలు ఇస్తాము అంటూ అధికారులు చెప్పటంతో మగవారితో సహా ఆడవాళ్లు కూడా విధులకు వెళ్తున్నారు. అయితే డ్యూటీ లో చేరాలంటే డబ్బులు కట్టాలి, వారితో శారీకంగా కలవాలి అప్పుడే ఆ ఉద్యోగం ఇస్తారు. ఈ ఘటన భద్రాచలం డిపో లో చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఇంచార్జి గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, రాజు అనే వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది.