సమంత టైటిల్ పాత్రలో నటిస్తోన్నసినిమా శాకుంతలం. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా మైథలాజికల్ లవ్ స్టోరీగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తోన్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజువల్ ఫీస్ట్‌గా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ భూమి మీద అమ్మనాన్నలకు అక్కరలేని తొలి బిడ్డ మేనక విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది అనే డైలాగ్‌తో శాకుంతలం ట్రైలర్ ప్రారంభమైంది. శకుంతల కారణ జన్మురాలు, ఒక నవ నాగరిక చరిత్రకు నాంది పలకబోతున్నది అనే డైలాగ్‌తో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించాడు.
చెలికత్తెలు శకుంతల కోసం వెతుకుతుండటం, అదే సమయంలో దుష్యంతుడు ఆమెను చూసి మైమరచిపోయే సీన్‌తో సమంత ను ట్రైలర్‌లో చూపించారు. స్వచ్ఛమైన తన ప్రేమ కోసం దుర్వాసుడి ఆగ్రహానికి, కశ్యప మహర్షి అనుగ్రాహానికి మధ్య ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే అనే డైలాగ్‌తో సమంత ప్రేమకు ఎదురయ్యే కష్టాలు చూపించారు.
తనను ప్రాణంగా ప్రేమించిన దుష్యంతుడే ఎవరో తెలియదని చెప్పే డైలాగ్ ఆసక్తిని పంచుతోంది. ప్రేమతో పాటు యుద్ధ సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ చివరలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హను కనిపించింది. శకుంతలగా సమంత లుక్, నటన ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి, సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్ని పోషించారు. ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. త్రీడీలో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు.
దిల్‌రాజుతో కలిసి గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తోంది. యశోద సక్సెస్ తర్వాత విడుదలవుతోన్న ఈ సినిమా కోసం సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.