కార్తీక మాసం లో 41 దినములు నియమ నిబంధలనతో, నల్లని దుస్తులతో కటిక నేలపైనా శయనించి తమ కోర్కెలు తీర్చాలంటూ అయ్యప్ప స్వామి ని కోట్లాది మంది కొలుస్తారు. జీవితంలో ఒకసారైనా శబరి కొండను దర్శించాలని పురాణాల్లో చెప్తారు. అంతటి ప్రసిద్ధిగాంచిన శబరిమలకొండకు పాదయాత్రతో శ్రీకారం చుట్టారు స్వాములు. శ్రీధర్మ శాస్త్ర పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో గురుస్వాములు వెంకటేష్ యాదవ్,
వెంకట్ యాదవ్, హరిక్రిష్ణ యాదవ్, రాము యాదవ్ ల వెంట సాగుతున్న శబరిమల మహా పాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. మహబూబ్ నగర్ కనిమెట్ట కు చేరుకున్న స్వాములకు శ్రీమతి శ్రీ రాపర్తి రాజు జయలక్ష్మి యాదవ్ లు అన్నదానం చేసి వారి భక్తిని చాటుకున్నారు. 38 రోజులపాటు జరిగే ఈ మహాయాత్రకు 120 మంది స్వాములు అడుగుకదిపారు. స్వామి నామస్మరణతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ ముందుకదులుతున్నారు.