పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్స్, రహస్యంగా ఆడియో రికార్డింగ్ చేయించటంపై మాజీమంత్రి షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు. మమ్మల్ని అనటం కాదు ముందు నీ ప్రగతి భవన్ సంగతి చెప్పు అంటూ కౌంటర్ వేశాడు.
చెడును ఏరి వేయటం ప్రగతి భవన్ నుండే కేటీఆర్ మొదలుపెడితే… అక్కడే దొంగ నోట్ల చెలామణి దొంగ దొరుకుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ నోట్ల చెలామణి, దొంగ పాస్ పోర్టులతో జనాలను విదేశాలకు పంపేవారు, మనుషుల అక్రమ రవాణాలో ఎవరెవరున్నారో అన్ని విషయాలు బయటపడతాయని షబ్బీర్ సూచించారు. అంతేందుకు సీఎం కేసీఆర్ అసలు అమెరికా పర్యటనకే ఎందుకు వెళ్లరో కేటీఆర్ చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్, హరీష్ రావులపై దొంగ నోట్ల చెలామణి, ఫేక్ పాస్ పోర్ట్, మనుషుల అక్రమ రవాణా ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అదే అంశాన్ని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని క్రిమినల్ గా కేటీఆర్ కామెంట్ చేయటంపై షబ్బీర్ రియాక్ట్ అయ్యారు.
If @KTRTRS is scavenging for filth, then he must do it at Pragathi Bhavan. He will find a true 'thug' who is a suspect in fake currency, fake passport & human trafficking rackets. He should give a simple answer: Can KCR travel to US? If not, why?@revanth_anumula @manickamtagore
— Mohammad Ali Shabbir (@mohdalishabbir) September 17, 2021
Advertisements