బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే…ఈ సినిమాకు లయన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ నే మేకర్స్ ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా రిజిస్టర్ చేసినట్లు కూడా ఓ నోట్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.