టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సమయాన్ని పూర్తిగా పుష్ప సెకండ్ పార్ట్ కోసమే కేటాయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు వాయిదా పడుతు వచ్చింది. ఇక మొత్తానికి ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన సుకుమార్ గ్యాంగ్ కూడా వీలైనంత త్వరగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయాలని అనుకుంటుంది.
అయితే ఆ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఒక బాలీవుడ్ హీరో సినిమాలో ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే మరోసారి ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా ఆ వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన అతిథి పాత్ర కోసం అల్లు అర్జున్ ను దర్శకుడు సంప్రదించినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. ఇక బన్నీ కూడా ఆ విషయంలో కాస్త పాజిటివ్ గానే స్పందించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక అల్లు అర్జున్ సన్నిహితుల సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ ఆ పాత్ర చేయడానికి సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా కూడా అల్లు అర్జున్ కెరీర్ కు చాలా ముఖ్యం కానుంది. ఫస్ట్ పార్ట్ కంటే పుష్ప 2 కోసం ఎక్కువ స్థాయిలో బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1000 కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చు అనే విధంగా అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి బన్నీ తన ఫోకస్ ఎటువైపు మరల్చకుండా పుష్ప సెకండ్ పార్ట్ ను మరింత హైలెట్ చేయాలి అని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జవాన్ సినిమాలో గెస్ట్ పాత్రలో కూడా నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. మరి దర్శకుడు జవాన్ సినిమా కోసం గెస్ట్ పాత్రలో ఇంకా ఎవరిని సంప్రదిస్తాడో చూడాలి.