కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా.. ఇలా అనేక పేర్లతో షారుక్ ఖాన్ ను పిలుచుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలోకి అతను అడుగు పెట్టి 30 ఏళ్లు పూర్తయింది. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు షారుక్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు. అంతకుముందు టీవీ యాక్టర్ గా, నెగెటివ్ రోల్స్ వేస్తూ ఉండేవాడు. విజయాలు, అపజయాలు.. ఎన్నో చేదు అనుభవాలు ఇలా 30 ఏళ్లుగా తన సినీ కెరీర్ ను కొనసాగించాడు.
ప్రస్తుతం షారుక్ నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో పొడవాటి జుట్టుతో ముఖంపై రక్తంతో గన్ చేతబట్టి కనిపించాడు. యశ్ రాజ్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.
షారుక్ 2018లో వచ్చిన జీరో సినిమాలో చివరిగా కనిపించాడు. వరుస ఫ్లాపులు వస్తుండడంతో కాస్త లేట్ అయినా పర్లేదు.. గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయి పఠాన్ సినిమాను లైన్ లో పెట్టాడు. ఇది యాక్షన్-థ్రిల్లర్ మూవీ. అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ.. యాశ్ రాజ్ సంస్థకు 50వ సినిమా.
పఠాన్ మూవీని 2023 జనవరి 25న విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు. హిందీ, తమిళం, తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత దీపికాతో నాలుగోసారి జత కట్టాడు షారుక్.