సినిమా ఫీల్డ్ లో ఒక్కరు ఎంటరై కాస్తనిలదొక్కుకుంటే చాలు. వారసత్వం స్టార్టైపోతుంది.ఇండియాలో ఏవుడ్డైనా..వారసత్వంపు అడ్డా.! తాజాగా బాలీవుడ్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆగండి..! ఆగండి..! అలా మీ ఇష్టానికి హీరోగా ఊహించేసుకోకండి. నాన్నలా నేను తెరమీదకి రాను. మనదంతా తెరవెనుక వ్యవహారం అంటున్నాడు. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు డైరెక్టర్ని అంటున్నాడు.
అయితే ఖాన్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ దర్శకుడిగా సొంతగా కథ రాసుకొని ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్ సోషల్ మీడియాద్వారా
వెల్లడించాడు. తన తొలి ప్రాజెక్టు కోసం స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఓ ఫీచర్ ఫిల్మ్ కోసం ఆర్యన్ ఈ కథ రాసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఓ వెబ్ సిరీస్ అని సమాచారం. ఆర్యన్ దర్శకుడిగా షొ రన్నర్ గా ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నాడు.
Kickstarting a new journey! 🎬️ 🎦 #AryanKhan #RedChilliesEntertainment pic.twitter.com/hAHyfYovTN
— Red Chillies Entertainment (@RedChilliesEnt) December 6, 2022
షారూక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంతో కలిసి అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. తన కుమారుడు ఆర్యన్ స్ర్కిప్ట్ పూర్తి చేశాడని, దాన్ని చూసేందుకు వేచి ఉండలేకపోతున్నానని గౌరీ ఖాన్ పేర్కొన్నారు.