సింపుల్ కథాంశంతో వైవిధ్యమైన సినిమాలు సృష్టించడంలో మాలీవుడ్ తనకు తానే సాటి. అందుకే దేశవ్యాప్తంగా మలయాళీ కథలకు మాంచి డిమాండ్ ఉంది. నార్త్ సినిమాలకు మలయాళ రీమేక్స్ పెద్దగా కలిసిరాకపోయినా…బాలీవుడ్ స్టార్స్ మాత్రం మలయాళీ సినిమాలు రీమేక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
మేటర్ ఎక్కడ మిస్సవుతుందో తెలియదు. బాలీవుడ్ లో తెరకెక్కించిన అన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ సెల్ఫీ సినిమా నిరాశపరిచినా.. మరో మాలీవుడ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీటౌన్ రీమేక్ స్టార్ షాహిద్ కపూర్.
కబీర్ సింగ్, జెర్సీ లాంటి రీమేక్స్ తో మంచి విజయాలు సాధించిన షాహిద్ కపూర్ ఇప్పుడు మరో సౌత్ సినిమా మీద మనసు పడ్డారు.అందుకే ప్రజెంట్ లైన్‌లో ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టి..ఈ నయా రీమేక్ సినిమాను ను లైన్‌లోకి తీసుకువచ్చారు.
2013లో రిలీజ్ అయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ముంబై పోలీస్‌ను హిందీలో రీమేక్ చేస్తున్నారు షాహిద్. రీసెంట్‌గా ఈ సినిమాను హంట్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సుధీర్ బాబు లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
తెలుగు వర్షన్ నిరాశపరిచినా నార్త్ మేకర్స్ మాత్రం ముంబై పోలీస్ కథ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావటంతో ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. ఆల్రెడీ ముంబై పోలీస్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ మేకర్స్ షాహిద్‌తో పాటు సిద్దార్ధ్ రాయ్ కపూర్‌ను లీడ్ రోల్స్ కోసం ఫైనల్ చేశారు.
ఈ సినిమా కోసం ఆల్రెడీ కమిట్ అయిన అనీస్ బజ్మీ మూవీని కూడా పోస్ట్ పోన్ చేశారు షాహిద్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుండటంతో ఏప్రిల్‌లోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
ఇప్పటి వరకు సౌత్ నుంచి ఎమోషనల్ డ్రామాలనే రీమేక్ చేసిన షాహిద్, ఫస్ట్ టైమ్ ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాతో మరో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు షాహిద్ కపూర్.