షారూఖ్ కూతురు.. సుహానా ఫస్ట్‌డీల్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ కూతురు సుహానా గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ ఓకే చేసిన సందర్భం కనిపించలేదు. కాకపోతే ఓ మేగజైన్‌పై కవర్‌పేజీ గాల్‌గా కనిపించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె తల్లి గౌరీ వెల్లడించింది. ముంబైలో ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో గౌరీఖాన్ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. తమ కూతురు సుహానా ఓ మేగజైన్ కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఐతే, ఏ మేగజైన్ అనేది చెప్పకుండా సస్పెన్స్‌లో పట్టేసింది. కవర్‌పేజీ పిక్‌తో బాలీవుడ్‌లో ఆఫర్స్ రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇక సుహానా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతోదూరం లేదని అంటున్నారు షారూఖ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్.

 

View this post on Instagram

She is rocking 😻💕

A post shared by Suhana Khan FC (@suhana.khan) on