కొన్ని రోజుల క్రితం ఆనాటి కార్పోరేటర్, నేటి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి… షేక్ పేట ఎమ్మార్వోకి మధ్య వాగ్వాదం జరిగింది. తను కోర్టుకు వెళ్లాల్సి ఉంది, వెళ్లనివ్వాలంటూ ఎమ్మార్వో ఎంత చెప్పినా విజయలక్ష్మి రెచ్చిపోయారు. మొదట విజయలక్ష్మి, ఆ తర్వాత ఎమ్మార్వో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
కానీ విజయలక్ష్మిని మేయర్ గిరి వరించటంతో… పదవి తీసుకున్న గంటల వ్యవధిలోనే షేక్ పేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. దీంతో ఇది పొలిటికల్ ట్రాన్స్ ఫర్ అని సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఇదే అంశంపై ఎమ్మార్వో పెదవి విప్పారు.
తనకు అధికారికంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందలేదని, అసలు ఎందుకు ట్రాన్స్ఫార్ చేశారో కూడా తెలియదని చెప్పారు. బదిలీలు కామన్ గా జరుగుతాయి, ఇది కూడా అలాగే జరిగిందనుకుంటున్నానన్నారు. గొడవ జరిగిన రోజు.. కోర్ట్ కు వెళ్లాల్సి ఉండగా కేస్ స్టడీ చేస్తున్నానని తెలిపారు. ఎక్కడ పని చేసినా… సమర్ధంగా పని చేస్తానన్నారు. ఇది ఇంతవరకు రావాల్సింది కాదని, ఘటనపై రెవెన్యూ సంఘాలు సానుభూతి వ్యక్తం చేశాయని తెలిపారు.