బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తీరు చిత్రంగా ఉంది. నిన్న నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్‌తో ఎంచక్కా ఫోజ్ ఇచ్చి కారు దిగి పోతున్నట్టు కమలంతో దోస్తీ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు.
ఏమైందో ఏమో గాని తెల్లారేసరికి మాట మారిపోయింది. అబ్బే తాను పార్టీ మారడం అసంభవం. కేసీఆర్ నా రాజకీయ గాడ్ ఫాదర్.. అమ్మా…ఆయనను వదిలి మరో చోటికి పోవడమా అంటూ అమాయకంగా చెప్పారు.
ఎంపీ గారిని అభివృద్ధి పనుల కోసం, నియోజకవర్గ వ్యవహారాల కోసం కలిస్తే ఇలా కథలు అల్లితే ఎలా? అంటూ ఎదురు ప్రశ్నించారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న రూమర్లను షకీల్ కొట్టిపారేశారు. రాజకీయం అంటే ఇదే మరి. ఎప్పటి సీను అప్పటిదే. పరిస్థితులను బట్టి ప్రయారిటీలు మారతాయి. షకీల్ అహ్మద్ కు కేసీఆర్ ఏం తాయిలం ఆశ చూపారో వెంటనే కారు దిగడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయితే ఎక్కడైనా బీజేపీ వర్గాలు ఆయన మా పార్టీలోకి వస్తున్నట్టు చేసిన ప్రకటన ఆడియో గాని వీడియో గాని ఉందా? అంటూ సెటైర్ వేశారు. అదీ రాజకీయం.
ఇక్కడ మేటరేంటంటే..నిజామాబాద్‌లో పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన కవితకు షకీల్ బాగా దగ్గర అని అతని సన్నిహితులు చెబుతుంటారు. మరి కవిత లాస్ట్ మినిట్‌లో కానీ ఎంటరై వుండచ్చునని అనుకుంటున్నారు.