భారతీయ సినీ పరిశ్రమలో షకీలా పేరు వినని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. సౌత్ నుంచి నార్త్ వరకు షకీలా పేరు అందరికీ తెలుసు. 1990లలో ఆమెను బాక్సాఫీస్ క్వీన్‌గా పిలిచేవారు. ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్లకు ఆమె సినిమాలు డబ్బుల వర్షాన్ని కురిపించాయి. అయితే బయోపిక్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో షకీలా బయోపిక్ కూడా త్వరలో వెండ తెర మీద ప్రదర్శితం కానుంది. అందులో భాగంగానే ఆ మూవీకి చెందిన టీజర్‌ను తాజాగా లాంచ్ చేయగా..నెటిజన్లు అందులో షకీలాగా నటించిన రిచా చడ్డాను చూసి షాక్‌కు గురవుతున్నారు.
షకీలా జీవితగాథతో షకీలా పేరిట సినిమాను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇంద్రజిత్ లంకేష్ షకీలా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, మళయాళం నటుడు రాజీవ్ పిళ్లైలు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక నటి రిచా చడ్డా ఈ మూవీలో షకీలాగా నటిస్తోంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేయగా.. అందులో రిచా చడ్డాను చూసి ప్రేక్షకులు స్టన్ అవుతున్నారు. షకీలా క్యారెక్టర్ మూవీల్లో సహజంగానే చాలా బోల్డ్ గా ఉంటుంది. కనుక ఆమెకు ఏరకంగానూ తీసి పోని విధంగా రిచా చడ్డా ఈ మూవీలో నటించింది.
ఇక టీజర్ లాంచ్ సందర్బంగా రిచా చడ్డా స్పందిస్తూ.. ”మూవీ విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఈ మూవీ చక్కని వినోదాన్ని అందిస్తుందని విశ్వసిస్తున్నా. కరోనా వల్ల ఈ ఏడాది మొత్తం జనాలు అనుభవించిన డిప్రెషన్ ఒక్కసారిగా పోతుంది. షకీలా స్టోరీ ఇతరుల స్టోరీల్లా కాదు, అది యూనివర్సల్. దక్షిణాదిలో ఆమె అందరికీ తెలుసు, అందువల్ల ఆమె బయోపిక్‌ను జనాలు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆమె సినీ ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలింది. థియేటర్లకు నష్టాలు వచ్చినప్పుడు ఆమె వల్లే వారు స్థిరంగా వ్యాపారాలు చేసుకోగలిగారు. పంకజ్ త్రిపాఠితో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది..” అని ఆమె తెలిపింది.
అయితే షకీలా మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న థియేటర్లకు ఆమె మళ్లీ కనక వర్షం కురిపిస్తే.. నిజంగానే ఆమె ఈసారి బాక్సాఫీస్ క్వీన్ అవుతుంది. మరది జరుగుతుందో, లేదో చూడాలి..!
Watch Video: