ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, క్రీడాకారులు,సినీ తారల జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ లో తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శృంగార తార షకీలా బయోపిక్ కూడా రూపొందింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిచా చద్దా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి షకీలా మాట్లాడుతూ..నేను బతికి ఉండగానే నా బయోపిక్ రూపొందడం ఎంతో ఆనందంగా ఉంది. రిచా చద్దా అద్భుతంగా నటించింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో బాధలుంటాయి. నేను గౌరవాన్నో, సానుభూతినో కోరుకోవడం లేదు. అయితే నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కలేదని నేను భావిస్తాను.
నా వెనుక నా గురించి మాట్లాడే వారి గురించి నేను బాధపడను. నా ముఖం మీద విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్, చదువుకుంటున్న అమ్మాయిలకు ఈ సినిమా ద్వారా నేను చెప్పేదొక్కటే నేను మోసపోయినట్లు మోసపోకండి అంటూ చెప్పుకొచ్చారు.