తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సినీ నటి షకీలా రాజకీయ అరంగేట్రం చేశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాజా ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకశం లేదని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మానవ హక్కుల విభాగంలో ఆమె పనిచేయనున్నారు.
రీసెంట్‌గా తమిళ టీవీ ఛానెల్ విజయ్ టీవీలో ప్రసారమైన కుత్ విత్ కోమలి అనే రియాలిటీ షోలో ఆమె పాల్గొంటు వచ్చారు. ఇటీవలే ఎలిమినేట్ అయ్యారు. ఈ షోలో మంచి ప్రతిభ చూపించడంతో శృంగారతార పేరును వదిలేసి.. ఆమెను ఓ గృహిణిగా ప్రేక్షకులు ఆదిరించారు. త్వరలోనే వైల్డ్ కార్డ్‌తో మళ్లీ ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు.
సౌతిండియన్ స్టార్‌గా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వందలాది అడల్డ్ చిత్రాల్లో నటించి.. శృంగార తారగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు షకీలా. ఆమె నటించిన సినిమాలు ఒకదశలో స్టార్ హీరోలతో కూడా పోటీ పడేవి. ఇటీవలే ఆమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ కూడా తెరకెక్కింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు షకీలా.