ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. అయితే సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సమంత తెల్లటి దుస్తులలో దేవదూతగా కనిపించింది. నిజానికి ఈ లుక్ రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
దానికి కారణం ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి, రెండోది భీమ్లా నాయక్ ఈవెంట్ రద్దు కావడం, భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేయడం. ఈ ఘటనల కారణంగా శాకుంతలం వార్త రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఆవిరైపోయింది.
అలాగే ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ అందచందాలను ఆరబోసిన సమంత… ఇప్పుడు శకుంతల ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రేక్షకులు కోరుకున్న విధంగా కనిపించలేదు. గ్లామర్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.