ఇటీవల విడాకుల ప్రకటన తరువాత వరుస సినిమాలను చేస్తుంది హీరోయిన్ సమంత. హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
ప్రస్తుతం సమంత చేతిలో యశోద, శాకుంతలం సినిమాలు ఉన్నాయి. అయితే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇందులో అల్లుఅర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 21న ఉదయం 9:30 గంటలకు శాకుంతలం సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.