సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ పూర్తయి చాన్నాళ్లు అయినప్పటికీ ప్రచారం మాత్రం ప్రారంభం కాలేదు. ఒక దశలో సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
“అందరికీ నమస్కారం. చాలామంది శాకుంతలం అప్ డేట్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సీజీ వర్క్ లో చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ప్రేక్షకులకు మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. అందుకే టైమ్ పడుతోంది.”
ఇలా శాకుంతలం సినిమాపై అప్ డేట్ ఇచ్చారు నిర్మాత నీలిమ గుణ. ఈ సందర్భంగా ప్రమోషనల్ మెటీరియల్ పై కూడా స్పందించారు. ఓవైపు సీజీ వర్క్ జరుగుతున్నప్పటికీ, ప్రేక్షకుల కోరిక మేరకు సందర్భానుసారంగా శాకుంతలం సినిమాకు సంబంధించి మెటీరియల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
స్వీయ నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. దిల్ రాజు ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శాకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా దేవ్ పటేల్ కనిపించనున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమౌతోంది.