ఈసారి ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్న భారత పేసర్ షమీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తను తన కూతురు ఐరాను మిస్ అవుతున్నానని లాక్‌డౌన్ మొదలైనప్పటి నుండి ఐరాను తను కలవలేదన్న విషయాన్ని చెప్పాడు. షమీ తన భార్య హసీన్ జహాన్ కు దూరంగా ఉంటున్నాడు.ప్రస్తుతం ఐరా హసిన్ దగ్గర ఉంది.
లాక్‌డౌన్ సమయంలో తన ఫాంహౌస్ లో ప్రాక్టీస్ చేసేవాడిని అని షమీ అన్నాడు.ఇక గురువారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ తనకు మరియు ఇతర ప్లేయర్స్ కు తిరిగి ఫాంలోకి రావడానికి చాలా హెల్ప్ అయిందని అలాగే చాలారోజులు తరువాత క్రికెట్ ఆడడం తనకు మరియు టీం లోని ప్లేయర్స్ అందరికీ చాలా ఆనందాన్ని కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక లాక్ డౌన్ సమయంలో షమీ తన ఇంటి పరిసరాలలో ఉన్న నిరుపేద వలస కూలీలకు తన సహచరుడు,మిత్రుడైన ఉమేష్ యాదవ్ తో కలిసి ఆహారాన్ని పంచిన విషయం అందరికి తెలిసిందే.ఈ విషయం పై షమీని అడగగా అది మా బాధ్యతని చెప్పాడు.
ఈసారి ఐపీఎల్ లో క్రౌడ్ ఉండదుగా సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారని షమీని అడిగినప్పుడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు గ్రౌండ్ కి వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు మమ్మల్ని గ్రౌండ్స్ కి వచ్చి చీర్ చేసిన అభిమానులను ఇప్పుడు చీర్ చేసే బాధ్యత మా మీద ఉంది.సో బాగా ఆడి వాళ్ళని అలరిస్తామని ఆయన అన్నారు.