బాలీవుడ్ జంట సంజయ్ కపూర్, మహీప్ కపూర్ ల ముద్దల కూతురు షానాయ కపూర్ త్వరలో తన తొలి చిత్రం ‘బేధడక్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం కోసం ఆమె పగలు రాత్రి తేగా లేకుండా కష్టపడుతున్నట్లు బాలీవుడ్ లో టాక్.
ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె రోజురోజుకి పరిణితి చెందుతున్నట్లు తెలుస్తోంది. షానాయ సినిమాలకంటే ముందుగానే సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది. వారితో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంది.
బి టౌన్ ప్రపంచంలోకి ప్రవేశించాలనే తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉందని షానాయ తెలిపింది. ఇండస్ట్రీలోకి ప్రవేశించేముందు తన మనసు అనేక రకాల భావోద్వేగాలను కలిగి ఉందని పేర్కొంది.
“నేను ఈ సమయంలో ఉద్వేగంగా, ఉత్సాహంగా, కొంచెం కంగారుగా ఉన్నాను. ఎందుకంటే నా ఉత్తమమైన జీవితానికి ఇది మొదటి అడుగు. నా సుదీర్ఘమైన ప్రయాణానికి ఇది తొలి అడుగు. నేను ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి కన్న కల ఇది. దానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాను. ఈ చిత్రం కోసం నేను చాలా కష్టపడ్డాను. చిత్ర బృందానికి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బేధడక్ లాంటి చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చిన వారందరికీ చాలా కృతజ్ఞతలు’’ అని తెలిపింది.
ఈ చిత్రం లాంచింగ్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు జరిగిన వాటికి చాలా భిన్నంగా ఉంటుందని ఆమె పేర్కొంది. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిగా, కరణ్ జోహర్ తన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షానాయ కపూర్, లక్ష్య లల్వానీ, గుర్ఫతే పిర్జాదా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.