స్టార్ కిడ్ శనయా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటారు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ అభిమానులకు కను విందు చేస్తుంటారు. తాజాగా అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా అమ్మడు క్రీమ్ కలర్ అవుట్ ఫిట్ లో మరింత హాట్ గా కనిపించారు. లైట్ మేకప్‌లో కెమెరాలకు అమ్మడు ఫోజులు ఇచ్చింది. త్వరలో తెరంగేట్రం చేయనున్న ఈ అందాల భామ రోజు రోజుకూ గ్లామర్ డోసు పెంచుతూ వస్తోంది. దీంతో అమ్మడి అందాలను చూసి కుర్రకారు మత్తెక్కి పోతున్నారు.
సంజయ్ కపూర్, మహీప్ కపూర్ దంపతుల ముద్దుల కూతరు త్వరలోనే తెరంగేట్రం చేయబోతోంది. కరణ్ జోహార్ బేధక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు లక్ష్య, గురుఫతేహ పిర్జాదాలు కూడా నటిస్తున్నారు.
శనాయా అసిస్టెంట్ డైరెక్టర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. గుంజన్ సక్సేనా సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ది ఫ్యాబులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే వెబ్ సిరీస్ లోనూ అమ్మడు అతిథి పాత్రలో కనిపించి కనువిందు చేసింది.