లండన్ : శృంగార సామ్రాట్ అని పిలుచుకునే ఒకప్పటి క్రికెటర్ షేన్‌వార్న్ ముగ్గురు అమ్మాయిలతో కలిసి చేసిన రచ్చ ఇరుగుపొరుగు వారికి సినిమా చూపించింది. అసలే రసిక శిఖామణిగా పేరున్న ఇతగాడు ఈస్ట్‌లండన్‌లోని తన ఖరీదైన నివాసంలో సాగించిన ఈ రాసలీలలు ఇప్పుడు యుకేలో హాట్‌టాపిక్. సన్ పత్రిక అందించిన న్యూస్‌ను బట్టి షేన్‌వార్న్ ఆ రాత్రి తన లవర్, మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి ఇంట్లో బీభత్సమైన పార్టీ చేసుకున్నాడు. తన డబ్బు.. తన గాళ్స్… తప్పులేదు కానీ, తలుపులు వేసుకోవడం మరచిపోయి మరీ సృష్టించిన వీరంగమే పక్కింటివారికి చికాకు తెప్పించింది. డవీనా (19), పాపీ (27) అనే సెక్స్ వర్కర్లతో కలిసి వార్న్ ప్రేమికురాలు అతడి ఇంట్లోకి వచ్చిందని, కాసేపటికే మొదలైన పార్టీ రెండు గంటలపాటు సాగింది. వార్న్ ఇంటి కిటికీ తలుపులన్నీ తెరిచే ఉండటంతో లోపల జరుగుతున్నదంతా పక్కింటి వాళ్లకు కళ్లకు కట్టింది. గ్లాసుల గలగలలు, చెవులు చిల్లులు పడే మ్యూజిక్.. చివర్లో అడల్ట్ కంటెంట్‌తో నైబర్స్‌కు ఆ రెండు గంటలూ నిద్ర కరవు. తర్వాత ఆ ముగ్గురు యువతులు వార్న్ జాగ్వార్ కారులో వెళ్లిపోయారు. మరునాడు ఉదయం చెప్పులు లేకుండానే వార్న్ కారులో ఇంటినుంచి బయటకు వెళ్లడం కనిపించింది. ‘తన చర్యలు పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్నాయన్న స్పృహ వార్న్‌కు లేకపోయింది’ అని పొరుగింటి వ్యక్తి చెప్పుకొచ్చాడు. ‘అతడి ఇంటి కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. వార్న్ ఇంటిపక్కన గౌరవప్రదమైన కుటుంబాలున్నాయి. తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో వార్న్ ఉన్నాడనుకోలేం’ అని మరొకరు కమెంట్ చేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » తలుపుల్లేని శృంగారం