ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిందితుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. బిజినెస్ క్లాసులో మహిళపై మూత్ర విసర్జన చేసింది తాను కాదని విచారణలో వెల్లడించాడు. మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన చేశానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పాడు.
తాను మహిళ పట్ల అలా ప్రవర్తించలేదన్నారు. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుని తనపై అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని పాటియాల కోర్టులో వెల్లడించాడు. నిందితుని తరఫు న్యాయవాది ఈ మేరకు వాదనలు వినిపించారు.
ఆ వృద్దురాలు తన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తన సీట్లో తానే మూత్ర విసర్జన చేసుకుందని ఆయన వాదించారు. 30 ఏండ్లుగా ఆమె భరత నాట్య కళాకారిణిగా ఉందన్నారు. వారికి మూత్ర విసర్జన సమస్య రావడం అత్యంత సహజమేనని చెప్పారు.
గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాసులో ప్రయాణిస్తున్న వృద్ధురాలిపై శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు.